శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By sarath
Last Modified: గురువారం, 11 మే 2017 (19:39 IST)

ఇళ్లు కాలుతుంటే... సెల్ఫీ దిగిన MLA...

వెర్రి వేయి తలలు అని పెద్దలు ఊరికే అనలేదు. మానవత్వాన్ని మరచి పైశాచిక ఆనందాన్ని పొందే పలువురిలో ఇప్పుడు ఇంకొకరు ప్రపంచానికి పరిచమయ్యారు. అతను సాధారణ వ్యక్తి అయితే విశేషమేముంది అతనో ఎమ్మెల్యే అవడమే పలువురిని ఆకర్షించిన విషయం. చేసిన ఘనకార్యం ఇల్లు తగలబడ

వెర్రి వేయి తలలు అని పెద్దలు ఊరికే అనలేదు. మానవత్వాన్ని మరచి పైశాచిక ఆనందాన్ని పొందే పలువురిలో ఇప్పుడు ఇంకొకరు ప్రపంచానికి పరిచమయ్యారు. అతను సాధారణ వ్యక్తి అయితే విశేషమేముంది అతనో ఎమ్మెల్యే అవడమే పలువురిని ఆకర్షించిన విషయం. చేసిన ఘనకార్యం ఇల్లు తగలబడి ఏడుస్తుంటే సెల్ఫీ దిగడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. 
 
రాజస్థాన్ లోని బయానా ప్రాంతానికి చెందిన బచ్చుసింగ్ అనే ఎమ్మెల్యే చేసిన ఈ పనిపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయానికి వస్తే, నిన్న మొన్నటి వరకు సాధారణ వ్యక్తులు ఆక్సిడెంట్ అయినా స్థలంలో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ ఫేస్బుక్ లోనో మరేతర సామాజిక మాధ్యమాలలోనో షేర్ చేసేవారు. ఇప్పుడు ఇది ప్రజా ప్రతినిధుల వరకు వచ్చింది. రాజస్థాన్ లోని బయానా గ్రామంలో అగ్ని ప్రమాదంలో పలువురి ఇల్లు దగ్ధమయ్యాయి. 
 
అటుగా కారులో వెళ్తున్న స్థానిక MLA బచ్చుసింగ్, మంటలు వ్యాపిస్తున్నా ఎవరూ సహాయక చర్యలు చేపట్టక పోవడంతో కారు దిగి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే స్పందించేలా చేశారు. ఇంతవరకు ఒకలా ఉన్నా తన ఇమేజ్ వెంటనే ఆయన గారు చేసిన పనికి మరోలా మారింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సహాయక చర్యలు చేపట్టకుండా, తన కెమెరాతో దగ్ధమవుతున్న గుడిసెల దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకొని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లకు మంచి టాపిక్ దొరికినట్లయింది చర్చించుకోవడాని, ఇక ఒక్క సారిగా ఆయనగారిపై విమర్శనాస్త్రాలతో దాడి చేసేసారు. భాద్యత కలిగిన ప్రజా ప్రతినిధి అయ్యుండి మీరు చేసే పని ఇదా తీవ్రంగా స్పందించారు.
 
దీంతో జరిగిన తప్పేంటో అర్థమైన MLA గారు, అది సెల్ఫీ కాదంటూ కాలుతున్న గుడిసెలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాను ఎవరైనా త్వరగా స్పందిస్తారని అంటూ సెలవిచ్చారు. అలా చేయడం వల్లనే అధికారులు సమయానికి వచ్చారంటూ చెప్పుకొచ్చారు, అయినా ప్రమాదం ఘటన సందర్భంలో నేను ఎందుకు సెల్ఫీ తీసుకొంటానంటూ ఎదురుప్రశ్న వేశారు. ఏదినిజమో ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా జనాలు మాత్రం MLA గారు చెప్పింది వింటూ తమ పనులు చూసుకొంటున్నారు.