గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (14:12 IST)

కిరణ్ బేడీకి వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు పంపిన ప్రభుత్వ అధికారిపై వేటు..

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది. 
 
ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీకి 30కి పైగా అశ్లీల వీడియోలు, మెసేజ్‌లను పంపిన శివకుమార్ అనే ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. కిరణ్ బేడీ ఓ వాట్స్ యాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, అన్ని శాఖల అధికారులనూ గ్రూప్ సభ్యులుగా చేర్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై సత్వర ఆదేశాలు ఈ గ్రూప్ ద్వారానే ఆమె జారీ చేస్తుంటారు. 
 
ఇక శుక్రవారం రాత్రి ఈ గ్రూప్‌కు మూడు ఫోల్డర్లలో వీడియో వచ్చింది. దీన్ని చూసిన కిరణ్ బేడీ సహా అధికారులు అవాక్కయ్యారు. అసభ్య మెసేజ్‌లు, వీడియోలు ఇందులో ఉన్నాయి. ఆ వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ ప్రీతాను కిరణ్ బేడీ ఆదేశించారు. సీనియర్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన్ను విధుల నుంచి తొలగించారు.