శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (15:57 IST)

ప్రతిపక్ష స్థానంలో కూర్చొనే అర్హత కాంగ్రెస్‌కు లేదు : సుప్రీంకోర్టు

ప్రస్తుత వాస్తవ పరిస్థితులు, గతంలో లోక్‌సభ స్థితిగతులను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్షంలో కూర్చొనే అర్హత లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు కదా.. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. 
 
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు చిత్తుగా ఓడించిన విషయం తెల్సిందే. దీంతో కేవలం ఆ పార్టీ 44 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, లోక్‌సభ సీట్ల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే కనీసం 52 సీట్ల ఉండాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. 
 
దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించలేదు. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా కాంగ్రెస్‌కు తేల్చిచెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు వినకుండా ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టు గడప తొక్కగా అక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.