గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (09:33 IST)

26/11 దాడులు : ముంబై మారణహోమానికి నేటికి ఏడేళ్లు..

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి సృష్టించిన మారణహోమానికి నేటి (గురువారం)కి ఏడేళ్లు నిండాయి. గత 2008 సంవత్సరం నవంబరు 26వ తేదీన ఉగ్రవాదుల దాడిలో ముంబై మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. ఈ దాడిలో 180 మందికిపైగా మృత్యువాత పడగా, మరో 700 మంది వరకు గాయపడ్డారు. 
 
ఉగ్రవాదులు సృష్టించిన దాడికి గాయపడిన ముంబై మహానగరం ఇప్పటికీ ఆ గాయాల నుంచి కోలుకోలేదు. గాయపడిన గుండెలు ఇంకా చల్లారనేలేదు. కానీ, ఈ మారణహోమం జరిగి అపుడే ఏడేళ్ళు గడిచిపోయాయి. నాడు ఉగ్రమూకలు సృష్టించిన భయోత్పాతాన్ని తలుచుకుంటే ఒక్క ముంబై వాసులే కాదు.. దేశ ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ ఏ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ విధ్వంసానికి పాల్పడిన విషయం తెల్సిందే.