శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 అక్టోబరు 2018 (16:25 IST)

కౌమార బాలికలు లైంగికదాడి... పెదివి విప్పని ప్రతి ఐదుగురులో ఇద్దరు

గతంలో కంటే ఇటీవలి కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులు ఎక్కువైనట్టు తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా, 15 నుంచి 19 ఏళ్ల వయసు గల టీనేజ్ అమ్మాయిలు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు తమపై జరిగిన లైంగిక దాడి గురించి బయటకు చెప్పడం లేదని ఈ సర్వేలో తేల్చింది.
 
గత 2015-16 సంవత్సరంలో 4.4 లక్షలమంది కౌమార బాలికలు లైంగికదాడికి గురయ్యారనే వాస్తవం జాతీయ సర్వేలో వెలుగుచూసింది. లైంగికదాడికి గురైన బాలికల్లో 35 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా, కనీసం వారి కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని ఈ సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, లైంగికదాడికి గురైన బాలికల్లో కేవలం 0.1 శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 నుంచి 49 ఏళ్ల వయసుమధ్య ఉన్న మహిళల్లో 14 లక్షల మంది లైంగికదాడికి గురయ్యారని సర్వేలో వెలుగుచూసిన వాస్తవం సంచలనం రేపింది. 
 
లైంగిక దాడి బాధితుల్లో 42 శాతం మంది సాయం కోరారని, వారిలో 1.9 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేశారని తేలింది. అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడే వారిలో కుటుంబసభ్యులతో పాటు, స్నేహితులు, బంధువులే ఎక్కువమంది ఉన్నట్టు ఈ సర్వేలో పేర్కొంది.