శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:13 IST)

షారూఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ తెరంగేట్రం.. బాయ్ హుడ్ రీమేక్‌లో..!

కింగ్ ఖాన్, నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

హాలీవుడ్‌లో ఘనవిజయం సాధించి, ఆస్కార్ పొందిన 'బాయ్ హుడ్' రీమేక్‌ ద్వారా ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలిసింది.  హాలీవుడ్‌లో రిచర్డ్ లింక్లాటర్ దర్శకత్వంలో 12 ఏళ్లపాటు ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఎల్లర్ కాల్ట్రేన్ నటించాడు.
 
కాగా లండన్‌లో ఈ చిత్రాన్ని చూసిన ఆర్యన్‌కు బాగా నచ్చింది. వెంటనే తండ్రి షారుక్‌కు ఫోన్ చేసి ఆ సినిమాను చూడమని చెప్పాడట. అంతేకాదు ఆ చిత్రం రీమేక్ చేయాలని, అందులో తాను నటించాలని అనుకుంటున్నట్టు తండ్రికి చెప్పాడని కుటుంబ దగ్గరి వ్యక్తుల సమాచారం. 
 
అందుకు కింగ్ ఖాన్ కూడా సుముఖంగా ఉన్నాడని, తానే ఆ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని, కొడుకును హీరోగా పెట్టి ఆ సినిమాను తానే నిర్మించాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో వెంటనే ఆ నిర్మాతలతో ఫోన్‌లో మాట్లాడి, నిర్మాణ హక్కులు తనకివ్వాలని షారుక్ అడిగాడట.