శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (13:05 IST)

ఎన్టీఆర్ పేరును మార్చడం కుదరదు.. అరుణ్ జైట్లీ

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు నందమూరి తారక రామారావు పేరు పెట్టడం మీద పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 
 
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును మార్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు.  అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరును తొలగించలేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడం పైన రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. 
 
దీనిపై  కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పేరు మార్పు పైన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వి హనుమంత రావు సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి సభలో నిరసన తెలిపారు. బుధవారం నాటి సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చకు వచ్చింది.