గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 30 మే 2015 (22:14 IST)

నర్సు అరుణా షాన్ బాగ్ ను రేప్ చేసిన సోహన్ లాల్ ఎక్కడున్నాడు..? ఏం చేస్తున్నాడు..?

అత్యాచారంతో షాక్ కు గురై 42 యేళ్ళు కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా షాన్ బాగ్ పై దారుణానికి ఒడిగట్టిన సోహన్ లాల్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? అలాగే నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నాడా..? లేక సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడా? ఈ ప్రశ్నలు ఎవరికైనా కలుగుతాయి. 42 యేళ్ళపాటు నరకయాతన అనుభవించిన అరుణా షాన్ బాగ్ ధీన గాథే ఎవరినైనా ఈ ఆలోచనలకు ఉసిగొలుపుతుంది. 
 
1973లో అరుణాషాన్ బాగ్ పై సోహన్ లాల్ భారతీ వాల్మీకి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర హింసకు గురి చేయడంతో ఆమె అప్పట్లో ‘పాక్షిక కోమా’లోకి వెళ్లిపోయింది. అక్కడ నుంచి మే 18 2014 వరకూ 42 యేళ్లపాటు కోమాలో ఉండిపోయారు. ఆమెకు ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి నర్సులే పూర్తి సేవ చేయడం గమనార్హం. 2014 మే 18న ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
1973 తరువాత సోహన్ లాల్ భారతీ వాల్మీకి చేసిన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో ఆయనకు కోర్టు ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది. ముంబయి జైలులో శిక్ష అనుభవించిన సోహన్ లాల్ విడుదలయ్యారు. 1980 ప్రాంతంలో విడుదలయిన అతను తన స్వగ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ నుంచి తన బావమరుదులు పిలవడంతో నేరుగా దాద్రి చేరుకున్నాడు. గత 35 యేళ్ళుగా హాపర్ జిల్లా పార్పా గ్రామంలో తన సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో స్వీపర్ గా పని చేస్తున్నారు.  
 
అక్కడి గ్రామస్తులు అందరు అతను చాలా మంచి వాడని చెబుతారు. చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తాడని చెబుతారు. కానీ ఇతను చేసిన నేరమేది వారికి తెలియను కూడా తెలియదు. వాస్తవానికి బలన్దాషార్ జిల్లా దాదుపూర్ గ్రామానికి చెందిన ఆయన అక్కడకు వలస వచ్చారని చెబుతారు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి కూడా తమ తండ్రి చేసిన నేరమేది తెలయను కూడా తెలియదు.  సోహన్ లాల్ వారిని కూడా స్వీపర్లుగా చేశాడు. వారు కూడా తమ తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.