శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (11:52 IST)

షీనాది చిన్న పిల్లల మనస్తత్వం.. నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేది!

సొంత తల్లి, మారు తండ్రి చేతిలో హత్యకు గురైన షీనా బోరాది చిన్న పిల్లల మనస్తత్వమని, తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాత్రమే షీనా చెప్పేదని.. అంతకు మించిన విషయాలను చర్చించేందుకు ఇష్టపడేది కాదని ఫేస్ బుక్ ఖాతాల ద్వారా షీనా ముంబైలో ఎకనామిక్స్ చదివిన సెయింట్ జేవియర్స్ కాలేజీ విద్యార్థినులు సామాజిక వెబ్ సైట్లలో పోస్ట్ చేశారు. 
 
షీనాతో తీసిన ఫోటోలు, ఆమె గురించిన వివరాలను కాలేజీ విద్యార్థులు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఆమె చాలా మంచి అమ్మాయని, చదువు పట్ల ఎప్పుడూ అంకితభావంతో ఉండేదని, అమాయకురాలని, ఎన్నడూ క్లాసులు ఎగ్గొట్టి ఎరుగదని వివరించారు. తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాత్రమే చెప్పే షీనా, అంతకు మించిన విషయాలను చర్చించేందుకు ఇష్టపడేది కాదని తెలిపారు. 
 
ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు షీనా ప్రయత్నిస్తూ ఉండేదని, ఫ్యాషన్ అంటే ఇష్టమని, స్నేహం చేసింది తక్కువ మందితో అయినా, వారితో బాగా కలిసి పోయిందని పోస్టులు పెట్టారు. ఉద్యోగంలో చేరిన తరువాత పని గంటలు అధికంగా ఉన్నాయని, కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పేదని షీనా స్నేహితురాలు ఒకరు తన ఫేస్ బుక్ ఖాతాలో వివరించారు.