శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (09:00 IST)

ఫోరెన్సిక్ పరీక్షకు ఇంద్రాణి, మైఖేల్ రక్తం.. వెంట్రుకలు

దేశంలో సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసులోని మిస్టరీని చేధించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. షీనా అవశేషాలతో సరిపోల్చేందుకు తల్లి ఇంద్రాణి, సోదరుడు మైఖేల్‌ బోరాకు చెందిన రక్తం, వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు. ఎందుకంటే షీనా బోరా హత్య కేసులో రహస్యం వీడాలంటే ఆమె శరీర అవశేషాల పరీక్ష తర్వాత ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చే నివేదికే కీలకం కానుంది. అందుకే వీరిద్దరి రక్తం, వెంట్రుకలను కూడా పరీక్షకు పంపించారు. 
 
మరోవైపు.. హత్య తర్వాత సరిగ్గా నెల రోజులకు (2012 మే 23) సగం కాలిన షీనా మృతదేహం, అస్థిపంజరాని రాయగఢ్ గ్రామస్తులు కనుగొన్నారు. కానీ, రాయగడ్‌ స్టేషన్‌ పోలీసులు అవశేషాలను జేజే ఆస్పత్రికి పంపి చేతులు దులిపేసుకున్నారు. దీనిపై వారెందుకు కేసు నమోదు చేయలేదన్నది మరో మిస్టరీగా మారడంతో కొంకణ్‌ రేంజి ఐజీ విచారణకు ఆదేశించారు. దీనిపై నివేదిక అందగానే బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డీజీపీ వెల్లడించారు.