మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (19:04 IST)

పాక్‌ గజల్ సింగర్ ప్రోగ్రామ్ వద్దు.. రద్దు చేయాల్సిందే: శివసేన

పాకిస్థాన్‌తో కలిసి భారత్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. గజల్ సింగర్ గులాం అలీ తన ప్రోగ్రామ్‌లను రద్దు చేసుకోవాలని శివసేన హెచ్చరించింది. పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సాంస్కృతిక కార్యక్రమాలను గజల్ సింగ్ వెంటనే రద్దు చేసుకోవాలని శివసేన డిమాండ్ చేసింది.

ఈ నెల 9వ తేదీన పాక్ గజల్ సింగర్ అలీ కన్సర్ట్ దేశంలోని వాణిజ్య నగరం ముంబైలో జరుగనున్న నేపథ్యంలో.. ఈ కన్సర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించేందుకు వీల్లేదని ఆ పార్టీ తేల్చి చెప్పేసింది. 
 
ఒకవేళ గజల్ సింగర్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయని పక్షంలో శివసేన పార్టీ తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపడుతుందని వార్నింగ్ ఇచ్చింది. చిత్రపథ్ సేన ప్రధాన కార్యదర్శి అక్షయ్ బద్రాపుర్కార్ మాట్లాడుతూ, ‘పాక్‌తో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, మన జవాన్లను ఆ దేశం పొట్టనబెట్టుకుంటుంటే.. పాక్ గాయకులను ఇక్కడికి ఎందుకు అనుమతించాలి’ అంటూ అడిగారు.