బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 26 మే 2016 (20:50 IST)

షాకింగ్ గర్ల్... దుస్తులిప్పేసి నగ్నంగా పోలీసులతో పోట్లాట... దుస్తులేస్కోమ్మా(video)

ఏం జరిగిందో తెలియదు కానీ ఓ అమ్మాయి పోలీసు స్టేషనులో వేసుకున్న దుస్తులు విప్పేసి నగ్నంగా మారిపోయి పోలీసులను దుర్భాషలాడుతూ వణికించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మ

ఏం జరిగిందో తెలియదు కానీ ఓ అమ్మాయి పోలీసు స్టేషనులో వేసుకున్న దుస్తులు విప్పేసి నగ్నంగా మారిపోయి పోలీసులను దుర్భాషలాడుతూ వణికించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేవలం బ్రా తప్ప మిగిలిన దుస్తులన్నీ వలిచేసి గిరాటేసిన సదరు అమ్మాయి పోలీసులతో వాగ్వాదం చేస్తోంది. ఆమె ఎందుకలా ప్రవర్తించిందన్నది మాత్రం తెలియరాలేదు. 
 
పోలీసు స్టేషనులో బల్లపై ఉన్న వస్తువులను అటూఇటూ గిరాటేస్తూ వేలిని పోలీసు అధికారి వైపు చూపిస్తూ పొట్ట కొట్టుకుంటూ నానా హంగామా చేసింది. పోలీసులు దుస్తులు వేసుకోవాలని బ్రతిమాలినా పట్టించుకోలేదు. చిట్టచివరికి వారు ఇచ్చిన దుస్తులు ధరించి కూడా పోలీసులను తిడుతూనే ఉంది. 
 
ఇదంతా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జరిగిందంటూ వీడియోలో చెప్పబడింది కానీ అహ్మదాబాదు పోలీసులు మాత్రం దాన్ని ఖండించారు. ఇది తమ పరిధిలో జరుగలేదనీ, ఢిల్లీలోనో మరింకెక్కడో జరిగిందని అంటున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం హల్ చల్ చేస్తోంది. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...