శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (09:19 IST)

అండగా ఉన్న స్పీకర్‌పై దాడి చేస్తున్నా... ఆవేశం తన్నుకొస్తున్నా... నిశ్చేష్టుడై చూసిన ఓపీఎస్

ఆయన తమిళనాడు రాష్ట్ర శాసనసభకు సభాపతి. పేరు ధనపాల్. గత ఆరేళ్లుగా తనకు అండగా ఉన్నారు. అనేక క్లిష్ట సమయాల్లో సభలో తనకు అనుకూలంగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తిపై విపక్ష డీఎంకే సభ్యులు దాడి చేస్తుంటే మాజీ ముఖ

ఆయన తమిళనాడు రాష్ట్ర శాసనసభకు సభాపతి. పేరు ధనపాల్. గత ఆరేళ్లుగా తనకు అండగా ఉన్నారు. అనేక క్లిష్ట సమయాల్లో సభలో తనకు అనుకూలంగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తిపై విపక్ష డీఎంకే సభ్యులు దాడి చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిశ్చేష్టుగై మిన్నకుండి పోయారు. ఈ సంఘటన శనివారం తమిళనాడు అసెంబ్లీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు శనివారం బలపరీక్షను ఎదుర్కొంది. ఆ సమయంలో సభలో డీఎంకే సభ్యులు రణరంగాన్ని తలపించారు. స్పీకర్‌పై దాడికి దిగారు. కుర్చీలు, టేబుల్స్, మైకులు ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలను చూసిన శశికళ వర్గానికి ఎదురు తిరిగిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆగ్రహం ముంచుకొస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో మౌనంగా చూస్తూ నిలుచుండిపోయారు.
 
దివంగత జయలలితకు పన్నీరు సెల్వం ఎంత నమ్మినబంటో అందరికీ తెలిసిందే. జయలలిత కూర్చున్న కుర్చీలో కూడా కూర్చునేందుకు ఆయన అంగీకరించలేదు. అలాంటి సందర్భంలో అసెంబ్లీలో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అండగా నిలిచిన స్పీకర్ ధన్‌పాల్ మీదకు డీఎంకే ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. అడుగడుగునా స్పీకర్ ధన్‌పాల్‌ను అడ్డుకున్నారు. ఒక దశలో పన్నీరు సెల్వంకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియంపై దాడికి దిగారు.
 
అలాగే స్పీకర్‌ను చేయిపట్టుకుని లాగారు. షర్టు చిరిగిపోయింది. నిన్నటి వరకూ అసెంబ్లీలో తనకు అండగా నిలిచిన స్పీకర్‌‌పై డీఎంకే సభ్యులు దౌర్జన్యానికి దిగుగుతున్న సమయంలో పన్నీరు సెల్వంకు ఆగ్రహం ముంచుకొచ్చింది. అయితే తనకు పూర్తి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను పన్నీరు సెల్వం నిస్సహాయంగా చూస్తుండిపోయారే తప్ప ఏమీ మాట్లాడలేదు. అయితే ఈ సందర్భంగా ఆయన ముఖంలో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.