గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (08:35 IST)

మరణశిక్ష రద్దు దిశగా కేంద్రం.. జాతీయ న్యాయ కమిషన్‌ సిఫార్సుతో చలనం

దేశంలో అమల్లో ఉన్న మరణశిక్ష రద్దు కానుందా? ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా? ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తే... ఇదే నిజమని తెలుస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉండి కూడా ఇంకా మరణశిక్షను అమలు చేయడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి జవాబులు చెప్పే పనిలో కేంద్రం నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా కేవలం ఉగ్రవాద చర్యలు, ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసుల్లో మినహా, ఉరిశిక్షను దాదాపు తొలగించేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు చట్టాల్లో సవరణలు తీసుకొచ్చేదిశగా మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు వినికిడి. గత ఏడాది జాతీయ న్యాయ కమిషన్‌ కొన్ని కీలక అంశాలపై సిఫార్సులు చేసింది. 
 
ఈ కమిషన్ చేసిన సిఫార్సుల్లో.. అత్యంత ప్రధానమైనది మరణశిక్ష రద్దు. ఈ అంశంపై కేంద్రం సానుకూలంగా ఉంది. దీనిపై అభిప్రాయం కోరుతూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. మెజారిటీ రాష్ట్రాలు గనుక ఉరిశిక్ష వద్దు అంటే.. దేశంలో మరణశిక్ష రద్దుకానుంది. ఎందుకంటే.. జాతీయ న్యాయ కమిషన్ ఈ శిక్షను రద్దు చేయాలని సిఫార్సు చేయడమే ఇందుకు అత్యంత ప్రధాన కారణం.