శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (12:48 IST)

కర్నాటక సీఎం సిద్దరామయ్య రూ. 70 లక్షల వాచ్ పెట్టుకున్నారా...?

చేతికి పెట్టుకునే రిస్ట్ వాచ్ రూ. 70 లక్షలంటే అబ్బురపడాల్సిందే. అంత ఖరీదైన గడియారాన్ని సామాన్యులే కాదు కాస్త ధనవంతులు కూడా పెట్టుకోలేరు. ఐతే ప్రజల కోసమే అన్నీ అని చెప్పే రాజకీయ నాయకులైతే వైట్ అండ్ వైట్ వేసి శరీరంపై ఎలాంటి ఖరీదైన నగలను ధరించకుండా తమ ఆస్తి ప్రజలే అని చెప్తుంటారు. 
 
ఐతే కర్నాటక ముఖ్యమంత్రి తన చేతికి రూ. 70 లక్షల విలువ చేసే వాచీని పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఐతే ఆ గడియారాన్ని సిద్దరామయ్య ధరించలేదనీ, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఓ మంత్రిగారు సిద్దరామయ్యకు సన్నిహితులైన వ్యక్తికి బహుమతిగా ఇచ్చిందని మరో వాదన జరుగుతోంది.