గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (16:06 IST)

ప్లీజ్.. మా తమ్ముడిని కాపాడండి.. కేంద్రానికి జవాను సోదరి కన్నీటి వినతి

సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ గాయపడిన జవాన్లకు సరైన వైద్యం అందడం లేదని కేంద్ర ప్రభుత్వంపై ఓ సైనికుడి సోదరి మండిపడ్డారు. అధికారంలో ఉండే రాజకీయ నేతలు అనారోగ్యానికి గురైతే విదేశాలకు వెళ్లి చికిత్స చ

సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ గాయపడిన జవాన్లకు సరైన వైద్యం అందడం లేదని కేంద్ర ప్రభుత్వంపై ఓ సైనికుడి సోదరి మండిపడ్డారు. అధికారంలో ఉండే రాజకీయ నేతలు అనారోగ్యానికి గురైతే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటారనీ, కానీ సరిహద్దుల్లో గాయపడిన జవాన్లకు ఎవరు వైద్యం చేస్తారని ఆ యువతి ప్రశ్నించింది. 
 
ఇటీవల పాకిస్థాన్ రేంజర్స్ దాడుల్లో గాయపడిన జవాను గుర్నామ్ సింగ్‌కు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. దీనిపై గుర్జీత్ కౌర్ అనే యువతి మండిపడ్డారు. సరైన వైద్య సౌకర్యాలు లేవని రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తుంటారని, మరి గాయపడిన సైనికులను ఎందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. 
 
అలా వీలుకానీ పక్షంలో విదేశీ వైద్య నిపుణులను తీసుకొచ్చి వారికి ఇక్కడే మెరుగైన వైద్య సౌకర్యాలు అందించవచ్చు కదా? అని ప్రశ్నించారు. తన తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, అతనిని కాపాడేందుకు విదేశాలకు తీసుకెళ్లవచ్చు కదా? అని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.