శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (12:39 IST)

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న స్మృతి ఇరానీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాల్యం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ దిల్లీ శివార్లలో ఓ పశువుల కొట్టం. దానికి ఆనుకునే ఓ రెండు గదుల ప

కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాల్యం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ దిల్లీ శివార్లలో ఓ పశువుల కొట్టం. దానికి ఆనుకునే ఓ రెండు గదుల పూరిల్లు. స్మృతి జీవితం మొదలైంది అందులోనే. స్మృతి తండ్రి ఓ పంజాబీ. ఓ బెంగాలీ అమ్మాయిని అతడు ప్రేమించాడు. రెండు వైపుల వాళ్లూ వీరి ప్రేమను అంగీకరించలేదు. దాంతో బయటికొచ్చి పెళ్లి చేసుకొని ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. బతకడానికి డబ్బుల్లేక ఓ పశువుల కొట్టాన్ని చూసుకునే పనిలో చేరారు. వీరి అన్యోన్య దాంపత్యానికి వీరికి స్మృతి పుట్టింది.
 
''అమ్మాయి ఇంటికి భారం, చంపేయండి'' అని వాళ్లమ్మకి ఎవరో సలహా ఇచ్చారట. అయినా ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆవిడకు మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అసలే పేదరికం, దానికితోడు ముగ్గురు ఆడపిల్లల్లోనూ పెద్ద... దాంతో చిన్న వయసులోనే స్మృతికి కుటుంబ భారం పంచుకోక తప్పలేదు. పదోతరగతిలో ఉన్నప్పుడే చిన్నచిన్న ఉద్యోగాలూ చేస్తుండేది. అరవై శాతానికి పైగా మార్కులతో టెన్త్‌, ఇంటర్‌ పాసైనా ఆపైన చదువుకోవడానికి కుటుంబ పరిస్థితి సహకరించలేదు. దాంతో కాలేజీ మానేసి దూరవిద్యలో చదవడం మొదలుపెట్టింది. 
 
మరో పక్క మిస్‌ ఇండియా పోటీలకు ప్రయత్నించమని స్నేహితురాలు స్మృతికి సలహా ఇచ్చింది. దాంతో ఎవరికీ తెలీకుండా తన ఫొటోలతో పోటీలకు అప్లికేషన్‌ పంపించింది. దాంట్లో ఆమెకూ చోటుదక్కింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి రాక ముందు టీవీ యాక్టర్‌గానే చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడామె ఆమె అందాల పోటీలోనూ పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అమె మిస్ ఇండియా పోటీలో పాల్గొనటమే కాకుండా… ఫైనలిస్టుల జాబితాలో కూడా చోటుదక్కించుకుంది. కానీ విజేతగా మాత్రం నిలవలేకపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లే స్మృతి 16 ఏళ్ల వయసులోనే ఢిల్లీలో సౌందర్య సాధనాలు మార్కెటింగ్ చేసే ఓ ఉద్యోగంలో చేరింది. చేసిన అప్పు తీర్చేందుకు బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగానికి చేరింది. అక్కడ టేబుళ్లు శుభ్రం చేయడం దగ్గరి నుంచి ఆర్డర్లు సప్లై చేయడం వరకు అన్ని పనులు చేసేది.
 
మరోవైపు మోడలింగ్‌లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతుండేది. అలా తొలిసారి టీవీలో ఓ చిన్న ప్రకటనలో మెరిసింది.. ఆ తర్వాత ఓ ఆల్బమ్, రెండు టీవీ సిరీస్‌ల్లో కనిపించింది. ఆ కార్యక్రమాలను శోభా కపూర్ చూడటం.. తన కుమార్తె ఏక్తాకు స్మృతి గురించి చెప్పడం జరిగాయి. ఏక్తాకపూర్ డైలీ సీరియల్ ''క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ'' లో తులసి పాత్ర స్మృతి జీవితాన్నిఎక్కడికో తీసుకెళ్లింది.