శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (18:19 IST)

ఉమెన్ చాందీ మెడకు సోలార్ స్కామ్ ఉచ్చు :: రూ.2 కోట్లు లంచమిచ్చా.. సరితా నాయర్

కేరళ రాష్ట్రాన్ని ఓ కుదుపుకుదిపిన సోలార్ స్కామ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు ఆయనకు రూ.2 కోట్ల మేరకు లంచం ఇచ్చినట్టు ఈ స్కామ్‌ వెనుక కీలక భూమిక పోషించిన సరితా నాయర్ చెప్పుకొచ్చారు. అలాగే ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రికి రూ.40 లక్షల మేరకు లంచం ఇచ్చినట్టు బహిరంగ ఆరోపణలు చేశారు. 
 
మరోవైపు సోలార్‌ స్కామ్‌ కేసులో ఆయనపై కేసు నమోదు చేయాలని త్రిశూర్‌ కోర్టు గురువారం ఆదేశించింది. ఇంకోవైపు ఆ స్కామ్‌కు వ్యతిరేకంగా వామపక్షాలు భారీ ఆందోళన నిర్వహించాయి. గురువారం తిరువనంతపురంలోని సచివాలయం వద్ద జరిగిన ఆందోళన హింసాత్మకమైంది. వామపక్ష కార్యకర్తలు సచివాలయంపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ‌చార్జ్‌ జరిపారు. టియ్యర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ రాజీనామా చేయాలని వామపక్ష కూటమి డిమాండ్‌ చేసింది.