శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (08:16 IST)

సోనియా రికార్డు : 17 యేళ్లుగా ఏఐసిసి అధ్యక్షురాలిగా..

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీలో కొత్త రికార్డును సృష్టించారు. సుదీర్ఘకాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన నేతగా ఆమె రికార్డుకెక్కారు. ఆమె ఇప్పటికి ఏఐసిసి అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు. 
 
1997లో కోల్కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకొన్న 62 రోజులకే 1998లో ఆమె పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ రికార్డు నెలకొల్పారు. 1999లో కర్నాటకలోని బళ్ళారి నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి ఆమె లోక్ సభకు పోటీ గెలుపొందారు.
 
 అదే సంవత్సరం  ఆమె 13వ లోక్ భకు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2004, 2009,2014 సంవత్సరాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె తన పదవిని ఈ పర్యాయం కుమారుడు రాహూల్ కు ఇవ్వనున్నారు.