శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2015 (10:28 IST)

ఆర్ఎస్ఎస్ నేతలంతా స్వలింగ సంపర్కులు : యూపీ మంత్రి ఆజం ఖాన్

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఆజం ఖాన్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ నేతలంతా స్వలింగ సంపర్కులని అందువల్లే వారు పెళ్లి పెటాకులు చేసుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారంటూ మండిపడ్డారు. హోమో సెక్సువాలిటీకి సంబంధించి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై ఆరెస్సెస్‌తో పాటు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేతలు భగ్గుమన్నారు. మతిస్థిమితం లేని కారణంగానే ఆజం ఖాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఒంటికాలిపై లేచారు. ఆయనను తక్షణం పిచ్చాసుపత్రిలో చేర్పించి తగిన వైద్యం చేయించాలని వారు సలహా ఇచ్చారు. అంతేకాకుండా, తక్షణం ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.