Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జైల్లో శశికళకు రాజభోగాలు.. ప్రత్యేక వంటగది.. జైళ్ల అధికారికి 2 కోట్ల ముడుపులిస్తే శాంక్షన్

హైదరాబాద్, గురువారం, 13 జులై 2017 (13:29 IST)

Widgets Magazine
sasikala

డబ్బున్న వాళ్లకు ఒక న్యాయం లేనివాల్లకు అన్యాయం ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్లో అడుగడుగునా అమలవుతోందని ఎన్నో ఉదాహరణలు లభ్యమవుతూనే ఉన్నాయి. కానీ మనకు మన రాజ్యాంగం  అంటే ఎనలేని పవిత్ర భావం మరి. వివక్షలకు, అన్యాయాలకు సంబంధించిన ఎన్ని వార్తలు మనం చూస్తున్నా మన మూలాలను ప్రశ్నించడానికి మాత్రం ఒప్పుకోం.
 
తాజాగా అన్నాడీఎంకే దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కర్ణాటక జైలులో లభిస్తున్న ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించిన వార్త గుప్పుమంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక వంటగది వసతి కల్పించారని, ఇంకా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. 
 
కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఆ శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆరుపేజీలతో కూడిన ఈ లేఖ జైళ్లశాఖలో కలకలం రేపుతోంది. శశికళకేగాక పలువురు ఖైదీలకూ ఇదే విధమైన వసతి లభిస్తోందని రూప తన లేఖలో తెలిపారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు ఒక జైళ్లశాఖ ఉన్నతాధికారికి రూ.2 కోట్ల ముడుపులు దక్కినట్లు తేలింది. 
 
మన దేశ జైళ్లలో డబ్బులు పడేస్తే చాలు ఏమయినా  జరుగుతుందని అర్థం కావడానికి ఇంకా సందేహమా?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్షిపణి ప్రయోగం సక్సెస్.. భార్యతో కిమ్ జాంగ్.. ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ వున్‌ సాధారణంగా తన భార్య రి సోల్ జుతో కలిసి మీడియా ...

news

సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ కథ ముగిసింది.. త్వరలోనే అంతం: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఓడిందని.. అందువల్ల అరబేతర దేశాలకు చెందిన యోధులంతా తిరిగి తమ తమ ...

news

గుర్రంపై ఊరేగిన వరుడు ఒక్కసారిగా బావిలో పడిపోయాడు (video)

పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటిదాకా ఎంతో హ్యాపీగా గుర్రంపై ఊరేగిన వరుడు ...

news

జూదంలో భార్యను పణంగా పెట్టాడు.. దుశ్శాసనులకు అప్పగించాడు.. ఇద్దరు అత్యాచారం

జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ...

Widgets Magazine