శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (15:26 IST)

అజారుద్దీన్ ఇంటికి కరెంట్, నీరు కట్ చేసిన అధికారులు!

న్యూఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నివాసాలు ఉన్నాయి.
 
అధికారిక నివాసాలు ఖాళీ చేయాలని చాలా సార్లు నోటీసులు పంపించినా.. తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌డీఎంసీ అధికారి తెలిపారు. విద్యుత్, నీటి నిలిపివేత తర్వాత కొందరు ఖాళీ చేశారని ఐతే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు.  
 
కాగా సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఇళ్లు ఖాళీ చేయాలని లోక సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానం చెప్పనివారి ఇళ్లకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలిపివేశారు.