శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (14:27 IST)

ఇస్లాం గురించి మాట్లాడితే చంపేస్తాం.. ముథాలిక్‌కు బెదిరింపులు

బాలీవుడ్ నటుడు ఆమీర్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా లేదా ఇస్లాం గురించి వ్యాఖ్యలు చేసినా చంపేస్తామంటూ శ్రీరామ్ సేన అధిపతి ప్రమోద్ ముథాలిక్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం హుబ్లీలో వెల్లడించారు. 
 
గతంలో హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ఆయన పలు రెచ్చగొట్టే ప్రసంగాలూ చేశారు. ‘‘అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేం భరిస్తాం’’ అని ప్రకటించి మరింత సంచలనం రేపారు.
 
ఈ నేపథ్యంలో... మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపైనే కాక, ఇస్లాం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముథాలిక్‌కు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ తరహా బెదిరింపులకు జడిసేది లేదని, హిందూ మత పరిరక్షణ కోసం పనిచేయకుండా తనను ఎవరూ ఆపలేరని ఆయన ప్రకటించారు.