శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (13:27 IST)

పన్నీర్ వర్సెస్ శశికళ.. లబ్ధి పొందాలనుకుంటున్న డీఎంకే.. స్టాలిన్ సెన్సేషనల్ కామెంట్స్

అన్నాడీఎంకే పార్టీలో అమ్మ మరణానికి తర్వాత.. సీఎం కుర్చీ కోసం పన్నీర్ వర్సెస్ శశికళల మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో అధికారం కోసం ఒక పక్క చిన్నమ్మ, పన్నీర్ సెల్వం పావులు కదుపుతుంటే మరో

అన్నాడీఎంకే పార్టీలో అమ్మ మరణానికి తర్వాత.. సీఎం కుర్చీ కోసం పన్నీర్ వర్సెస్ శశికళల మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో అధికారం కోసం ఒక పక్క చిన్నమ్మ, పన్నీర్ సెల్వం పావులు కదుపుతుంటే మరో వైపు తాజా పరిణామాలనుంచి లబ్ది పొందేందుకు డీఎంకే ప్రయత్నిస్తుంది. తదుపరి సీఎం అయ్యేది శశికళా లేఖ పన్నీర్ సెల్వమా అని తమిళులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. డీఎంకే అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తమిళనాడులో తదుపరి ప్రభుత్వం తమదేనంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బలాబలాల విషయానికి వస్తే తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే బలం 89, మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 8, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మిత్ర పక్షం కలుపుకుని డీఎంకే బలం 98. మరో 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే డీఎంకేకు అధికారం దగ్గే అవకాశం ఉంది. 
 
మరోవైపు శశికళ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది. పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. సీనియర్లు మదుసూధన్, పాఠశాల విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ లాంటి వారు సెల్వానికి జై కొట్టారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళ శిబిరాన్నివీడారు. మరో 12 మంది ఎమ్మెల్యేలను కోల్పోయినా ప్రభుత్వం ఏర్పాటుకు సాధ్యం కాదనే భావనలో చిన్నమ్మ ఉన్నారు.