ప్రేమించలేదని.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. యువతి సజీవదహనం

మంగళవారం, 14 నవంబరు 2017 (13:04 IST)

చెన్నైలో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ప్రేమించమని వెంటపడి వేధించడంతో పాటు ఏకంగా ఇంటికొచ్చి.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై ఆదంబాక్కానికి చెందిన ఇందుజా వెంట ఆకాష్ అనే యువకుడు ప్రేమించాలని వేధించాడు. అతడి ప్రేమను ఆమె అంగీకరించకపోవడంతో ఇందుజా పగ పెంచుకున్నాడు. 
 
సోమవారం రాత్రి యువతిని కలిసేందుకు వెళ్లిన ఆకాష్.. తనను ప్రేమించలేదంటే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే అతడికి వార్నింగ్ ఇచ్చేందుకు ఇందుజా తల్లి తలుపు తెరిచింది. అంతే ఇంట్లోకి చొచ్చుకుపోయిన ఆకాష్.. ఇందుజాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంటికి మంటలు వ్యాపించడంతో యువతి సజీవదహనమైంది. ఆమె తల్లి, సోదరి తీవ్రంగా గాయపడ్డారు.
 
కాలిన గాయాలతో ఉన్న వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుజా సోదరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో వున్న ఆకాష్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్..

సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు ...

news

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు... ఇప్పటివరకు రూ.66074.55 కోట్లు

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ...

news

బాహుబలి-2 స్టంట్ చేయబోయాడు.. ఏనుగు విసిరికొట్టింది (వీడియో)

బాహుబలి 2 సినిమాలో తొలి పాటలో ప్రభాస్ ఏనుగు తొండంపై నిల్చుంటాడు. అలాంటి స్టంట్‌ను ...

news

ప్లాస్టిక్ క్యాన్ సాయంతో ఈతరాకపోయినా నదిని దాటేసిన బాలుడు

మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఓ బాలుడు ఈతరాకున్నా ప్లాస్టిక్ ...