గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2016 (10:13 IST)

నోటు పుస్తకాలు తేలేదని మందలించిన టీచర్.. చెంపచెళ్లుమనిపించిన విద్యార్థి..!

నోటు పుస్తకాలు తీసుకురావడం మరిచిపోయాడని టీచర్ విద్యార్థిని మందలించింది. అయితే ఆ విద్యార్థి టీచర్‌తో వాగ్వివాదానికి దిగి ఆమెపై చేజేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ

నోటు పుస్తకాలు తీసుకురావడం మరిచిపోయాడని టీచర్ విద్యార్థిని మందలించింది. అయితే ఆ విద్యార్థి టీచర్‌తో వాగ్వివాదానికి దిగి ఆమెపై చేజేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరపాండి గ్రామం పాఠశాలలో సుశీల అనే గణిత అధ్యాపకురాలు ప్లస్‌టూ విద్యార్థులకు బోధిస్తున్నారు. 
 
గురువారం విద్యార్థి సూర్యప్రకాష్‌ తన నోటు పుస్తకాలను తీసుకురావడం మరిచిపోయాడు. దీన్ని గుర్తించిన అధ్యాపకురాలు.. అతనిని మందలించింది. అయితే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపానికి గురైన సూర్యప్రకాష్ అధ్యాపకురాలి చెంప చెళ్లుమనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు ఉమ విద్యార్థిని మందలించడంతోపాటు, తల్లిదండ్రులను పిలిపించి చర్చించిన అనంతరం విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు.