శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (11:44 IST)

అమ్మ కోసం టాప్ మోస్ట్ మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌లు... మరో అద్భుతం జరుగుతుందో? లేదో?: స్వామి ప్రశ్న

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య విషమ పరిస్థితిపై భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి స్పందించారు. జయలలిత ఎంతో గుండె నిబ్బరమున్న మహిళని కొనియాడారు. ప్రస్తుతం ఆమెకు ద

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య విషమ పరిస్థితిపై భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి స్పందించారు. జయలలిత ఎంతో గుండె నిబ్బరమున్న మహిళని కొనియాడారు. ప్రస్తుతం ఆమెకు దేశంలోనే పేరుమోసిన వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారన్నారు. అందువల్ల మరో అద్భుతం జరిగి ఆమె తిరిగి కోలుకోవాలన్నారు.
 
"జయలలితకు గుండెపోటు వచ్చిందని విని కలత చెందాను. ఆమె మానసికంగా దృఢమైన వ్యక్తి. మరో అద్భుతం జరిగిందని, ఆమె కోలుకుందని ఈ మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్లు చెబుతారని ఆశిస్తున్నాను. ఆ అద్భుతం జరిగిందో... జరగలేదో మరి కాసేపట్లో తెలుస్తుంది" అని అన్నారు. ఆమె కోలుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.