మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:58 IST)

తమిళనాడు రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రులు : బీజేపీ ఎంపీ స్వామి

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగుర వే

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగుర వేయడానికి ప్రధాన కారణం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు.. ఇళవరసి, సుధాకరన్‌లకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు.. రూ.10 కోట్ల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో అన్నాడీఎంకే ఎల్పీ నేతగా ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నికయ్యారు.
 
ఈ తాజా పరిణామాలపై స్వామి స్పందిస్తూ.. త‌మిళ‌నాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని ఆరోపించారు. వారి పేర్లు సరైన సమయంలో బయటపెడతానన్నారు. వారిద్దరే తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప‌న్నీరు సెల్వంతో తిరుగుబాటు చేయించార‌ని ఆయన తెలిపారు.
 
అదేసమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా న్యాయబద్ధంగా వ్యవహరించలేదని, ఆయన ఇప్పటికైనా తెలివైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సాయంత్రం ఆరుగంటలలోపు పన్నీరు సెల్వం తన మద్దతు ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేయని పక్షంలో పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.