బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (10:42 IST)

రాజపక్షేకు భారతరత్న ఇవ్వాలి: సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షేకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటున్నారు. అతనికి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వామి విజ్ఞప్తి చేశారు.
 
శ్రీలంకలో ఎల్టీటీఈని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు రాజపక్షేకు ఈ పురస్కారం ఇవ్వాలని స్వామి అభిప్రాయపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రధానికి ఓ లేఖ రాశారు. రాజపక్షేకు భారతరత్న ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళవాసులకు ఏ మేరకు ఆగ్రహం తెప్పిస్తాయో చూడాల్సి ఉంది.
 
గతంలోను సుబ్రహ్మణ్య స్వామి తమిళుల ఆగ్రహం చూడగొన్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక రక్షణ సిబ్బంది తమిళనాడు జాలర్లను, బోట్లను నిర్బంధించాయి. దీనిపై తమిళనాడులోని అన్ని పార్టీలు స్పందించాయి. జాలర్లను, బోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
అయితే, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తమిళ జాలర్లను విడిచి పెట్టాలని, బోట్లు ఇవ్వవద్దని చెప్పారు. దీనిపై తమిళ రాజకీయ పార్టీలు, ప్రజలందరూ గుర్రుగా ఉన్నారు. అంతేగాకుండా ఇప్పటికే మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో బెయిల్ విడుదలైన తరుణంలో తనపై కేసుపెట్టిన సుబ్రహ్మణ్యస్వామిపై కోపంగా ఉన్నారు.