శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (12:54 IST)

రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలి : సుబ్రహ్మణ్య స్వామి.. టైమ్ బాగోలేదా?

ఎల్టీటీఈని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా లేఖ రాశారు. దీంతో సుబ్రహ్మణ్య స్వామికి టైమ్ బాగోలేదని తమిళ తంబీలు అనుకుంటున్నారు.
 
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెలువడడం వివాదానికి దారితీసింది. 
 
ఇందులో భాగంగా సోమవారం అర్థరాత్రి చెన్నై మహానగరంలోని మౌంట్‌ రోడ్డులో ఉన్న రెండు సినిమా థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వి, పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసం సృష్టించారు.
 
సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ విజ్ఞప్తి ఎల్టీటీఈని అభిమానించే తమిళులకు ఆగ్రహం తెప్పించే విషయమైనప్పటికీ.. ఆయన మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. దీంతో కత్తి సినిమానే వదిలిపెట్టేందుకు తమిళ తంబీలు ఇష్టపడని నేపథ్యంలో.. సుబ్రహ్మణ్య స్వామి కూడా తమిళ బ్రదర్స్ కోపానికి పాత్రుడు అవుతారని సమాచారం. 
 
ఇటీవల తమిళ జాలర్లను, వారి బోట్లను శ్రీలంక రక్షణ సిబ్బంది నిర్బంధించిన నేపథ్యంలో జాలర్లను విడిచిపెట్టండి గానీ, వారికి బోట్లు ఇవ్వొద్దంటూ స్వామి వ్యాఖ్యానించారు. 
 
దీనిపై తమిళ రాజకీయాలు సుబ్రహ్మణ్య స్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జయలలిత జైలుకి వెళ్ళడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా కారణం కావడంతో అన్నా డీఎంకే వర్గాలు కూడా ఆయన మీద ఆగ్రహంగా వున్నాయి. ఇప్పుడు రాజపక్షే విషయంలో ఆయన తాజాగా చేసిన విజ్ఞప్తి విషయంలో రాజకీయంగా దుమారం రేగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.