శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 జులై 2016 (15:23 IST)

ఏపీని విభజిస్తే... అది దేశానికే సమస్యవుతుందని ఇందిర గాంధీ చెప్పారు.... సుజన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అది తెలుగు ప్రజలకే కాదు... మొత్తం దేశానికే సమస్య వస్తుందని ఆనాడు గ్రేట్ లీడర్ ఇందిరా గాంధీ చెప్పారని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.... ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అది తెలుగు ప్రజలకే కాదు... మొత్తం దేశానికే సమస్య వస్తుందని ఆనాడు గ్రేట్ లీడర్ ఇందిరా గాంధీ చెప్పారని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.... ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ, భాజపాలే కారణం. అడ్డగోలుగా విభజించడం వల్లనే ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. అందరితో సంప్రదించకుండానే ఏకపక్షంగా విభజించారు.
 
14వ ఆర్థిక సంఘం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదు. 5 ఏళ్లకు సంబంధించి ఆదాయ, ఖర్చుల గురించి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇది శాశ్వతం కాదు... వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు కావాలని అడిగారు. ప్రత్యేక హోదాపై మా ఆంధ్రప్రజలకు మా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మా ప్రభుత్వం పైన నిందారోపణలు నాకు బాధ కలిగిస్తుంది. ప్రత్యేక హోదా పేరుతో కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి అంటూ సుజనా చౌదరి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు.