Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాడు తండ్రి కాదు.. పాషాణ హృదయుడు... కుమార్తె చనిపోవడానికి 2 రోజుల ముందు లీగల్ నోటీస్

బుధవారం, 17 మే 2017 (10:06 IST)

Widgets Magazine
child deaths

ప్లీజ్ నాన్నా... నా ఆరోగ్యం క్షీణించిపోతోంది.. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నా... నన్ను కాపాడండి నాన్నా.. అంటూ అభ్యర్థించినా ఆ తండ్రి మనసు కరగలేదు. కానీ, కన్నీటితో అభ్యర్థించిన ఆ చిట్టితల్లి మాత్రం రెండు రోజులకే కన్నుమూసింది. తాజాగా శివశ్రీ తండ్రి శివకుమార్ ఎంతటి కఠినాత్ముడో తెలిసే మరో విషయం బయటపడింది. 
 
కుమార్తె మరణానికి సరిగ్గా రెండు రోజుల ముందు శివశ్రీ తల్లి సుమశ్రీకి లీగల్ నోటీసు పంపాడు. పాపతో కలిసి వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అందులో ఎవరూ ఉండటానికి వీల్లేదని నోటీసులో పేర్కొన్నాడు. తాజాగా మంగళవారం సుమశ్రీతోపాటు ఆమె సోదరులు, తోబుట్టువులు, స్నేహితులకు కూడా కేవియట్‌లు అందాయి. "నా ఇంట్లో ఉంటున్న మీరు ఖాళీ చేయమన్నా చేయడం లేదు. కోర్టుకు రండి" అని కేవియట్‌లో పేర్కొన్నాడు.
 
విజయవాడలోని దుర్గాపురానికి చెందిన మాదంశెట్టి వెంకట సాయి కృష్ణ శివశ్రీ కేన్సర్‌తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. వైద్యానికి అయ్యే ఖర్చు కోసం తాము ఉంటున్న ఇంటిని అమ్ముకునేందుకు అనుమతించాలన్న సుమశ్రీ అభ్యర్థనను శివకుమార్ తిరస్కరించడమే కాక ఇంటిని ఖాళీ చేయాలని బెదిరింపులకు కూడా దిగినట్టు భార్య సుమశ్రీ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తుప్పుపట్టిన వాహనాలు..

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి ...

news

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదనీ మేడపై నుంచి తోసేసిన భర్త... ఎక్కడ?

ఎంతో సంతోషంతో వివాహ వేడుకకు వెళ్లిన ఓ వివాహిత.. చివరకు శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ...

news

డిజిటల్ ఇండియా... డిజిటల్ ఇండియా అన్నారు... ఇప్పుడేమైంది... గుజరాత్ గుల్లవుతోంది...

డిజిటల్ ఇండియా అంటూ అన్నీ నెట్లో పెట్టేసి నోట్లో వేలేసుకుని క్లిక్ కొడితే చాలు అన్నీ మన ...

news

భార్య మరో వ్యక్తితో లేచిపోయిందనీ.. కన్నబిడ్డను చంపేసిన కసాయి తండ్రి.. ఎక్కడ?

కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని ...

Widgets Magazine