శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (12:42 IST)

భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశం: సుమిత్రా మహాజన్‌

భారత్ అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలను ఆమె కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులకు వందనాలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురుశుక్రవారాల్లో అంబేద్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు, తీర్మానంపై చర్చ జరగనుంది. వ్యవస్థలకు ప్రజా పునాదిని ఏర్పరిచిన దార్శనికత అంబేద్కర్‌ సొంతమని ఆయన సేవలను కొనియాడారు. సామాజిక సమానత్వానికి అంబేద్కర్‌ పెద్దపీట వేశారన్నారు.