శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (15:50 IST)

ఢిల్లీలో డీజిల్ క్యాబ్‌లపై నిషేధం.. సుప్రీం కోర్టు ఆదేశాలు

దేశ రాజధాని హస్తినలో డీజిల్ క్యాబ్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నిషేధం మే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్య స్థాయిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. డీజిల్ క్యాబ్‌ల స్థానంలో సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే క్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచన చేసింది. 
 
ఢిల్లీలో డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో ఆటోమొబైల్ తయారీ కంపెనీలైన మెర్సిడస్‌, టొయోటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జనరల్‌ మోటార్స్‌ తదితర కంపెనీలు సుప్రీంకోర్టులో పిటీషన్‌లను దాఖలు చేశాయి. ఇందులో 2,000 సీసీ, అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల కార్ల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాయి. 
 
ఈ పిటీషన్లంటిపైనా కోర్టు శనివారం విచారణ జరిపింది. ఇందులోభాగంగా డీజిల్ క్యాబ్‌లపై నిషేధం విధిస్తూనే.. డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని మే 9వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పింది. దీంతో ఆదివారం నుంచి డీజిల్ కార్ల రాకపోకలు రుద్దుకానున్నాయి. ఈ ఆదేశాలు న్యూఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపనుంది.