శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (18:26 IST)

శశికళకు సుప్రీం ఊరట.. తొందరెందుకు..? అక్రమాస్తుల కేసుకు సంబంధించిన తీర్పు రానుందిగా?

తమిళనాడులో ముఖ్యమంత్రి కుర్చీకోసం పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. బల నిరూపణ కోసం ఇరువురూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఎమ్మెల్యేలను బల నిరూపణ కోసం లాక్కునేందుకు

తమిళనాడులో ముఖ్యమంత్రి కుర్చీకోసం పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. బల నిరూపణ కోసం ఇరువురూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఎమ్మెల్యేలను బల నిరూపణ కోసం లాక్కునేందుకు పన్నీర్ సెల్వం నానా తంటాలు పడుతుంటే.. శశికళ మాత్రం ఎమ్మెల్యేలను నిర్భంధించి.. తనకు ఓటేసే దిశగా వారిని బెదిరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో శశికళకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించరాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ చట్ట పంచాయతీ ఉద్యమ సంస్థ సభ్యుడు సెంథిల్‌కుమార్‌ ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీం పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. ఇంత అకస్మాత్తుగా పిటిషన్‌పై విచారణ జరపాల్సిన పని లేదని అభిప్రాయపడింది. జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ పిటిషన్ నుంచి శశికళకు ఊరట లభించింది. 
 
ఇదిలా ఉంటే.. పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళల్లో ఎవరు సీఎం అయితే బెస్టో తేల్చాలని కోరుతూ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో చాలామంది సెల్వానికే తమ ఓటు అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళ సమయం నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో 78 వేలమందికి పైగా సెల్వం బెస్ట్ అన్నారు. అయితే సుమారు 4 వేల మంది శశికళ వైపు మొగ్గు చూపారు.