Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రేకింగ్ న్యూస్.. జల్లికట్టు చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో: తమిళ ప్రజలకు మరో విన్

మంగళవారం, 31 జనవరి 2017 (17:31 IST)

Widgets Magazine
jallikattu

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ విడుదల చేయడంపై తమిళనాడు సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే కొత్త చట్టం గురించి ఆరు వారాల్లోగా తమకు వివరాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.

అయితే జల్లికట్టు' నిషేధంపై పోరాటం చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా కొత్త చట్టం తీసుకువచ్చిన తమిళ ప్రజలకు మరో విజయం వరించింది. 2016 నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు తీసుకునేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించింది.
 
సుప్రీం కోర్టు నుంచి ఈ కొత్త చట్టానికి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. జల్లికట్టు చట్టంపై 'స్టే' ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారంనాడు నిరాకరించింది. అలాగే దీనిపై మద్రాసు హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అలాగే, జల్లికట్టు నిరసనల సమయంలో శాంతి భద్రతల పరిస్థితులను సక్రమంగా పట్టించుకోలేదంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. 
 
ఇదిలా ఉంటే.. జల్లికట్టు ఉద్యమం సమయంలో విధ్వంసానికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదిలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం స్పష్టం చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ సహా పలు జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో నిందితులను గుర్తించి, శిక్షిస్తామని చెప్పారు. నాటి హింసాకాండపై దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారతీయ ఐటీ కంపెనీలపై డోనాల్డ్ ట్రంప్ పిడుగు... ఉద్యోగుల్లో భయాందోళనలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యుఎస్ సర్కారు మరో సంచలన నిర్ణయం ...

news

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు.. సెక్స్‌ స్కామ్‌గా మారిపోయిందా? సుభ్ర కుండుకు లింకుందా?

తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ...

news

ఒబామా నోరు విప్పారు.. ట్రంప్ నిర్ణయం కోపం తెప్పించింది.. వివక్ష వద్దు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు ...

news

తిరుపతిలో పోలీసులే కబ్జాదారులు - రెండు కోట్ల స్థలం హాంఫట్...

కాపలా ఉండాల్సిన పోలీసులే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వ ఆస్తులకు ...

Widgets Magazine