Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళపై కేసులో తీర్పు వచ్చేవారమే.. నిరీక్షణ తప్పనట్లే

హైదరాబాద్, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (03:41 IST)

Widgets Magazine

ముఖ్యమంత్రి పదవి చిక్కుతుందా లేక చిక్కదా అంటూ మల్లగుల్లాలు పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వర్గానికి ఇది చేదువార్తే. అక్రమాస్తుల కేసులో తీర్పు నేడు వెలువరిస్తుందనుకున్న సుప్రీంకోర్టులో ఆ కేసు లస్టింగులోనే నమోదు కాకపోవడంతో వచ్చేవారం వరకు వేచి చూడాల్సి ఉంటుందని సమాచారం. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు పావులు కదుపుతున్న వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతున్నది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తుందని అందరూ భావించారు. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే.. శశికళకు సీఎం పదవి చేపట్టే చాన్స్‌ ఉండదని అనుకున్నారు. అయితే, సుప్రీంకోర్టు శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదుకాలేదు. దీంతో ఈ కేసులో వచ్చేవారం తీర్పు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.
 
అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్‌ చేయడంతో కర్ణాటక హైకోర్టు దీనిని కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, శుక్రవారం ఈ కేసు లిస్టింగ్‌ కాకపోవడంతో వచ్చేవారం తీర్పు రావొచ్చునని భావిస్తున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేంద్రాన్ని సంప్రదించనిదే అడుగు కదపని గవర్నర్: విసిగిపోయిన శశికళ వర్గం

తమిళనాడు రాజకీయ పరిణామాలపై గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం తన నిర్ణయం ప్రకటించకుండా ...

news

ఎమ్మెల్యేల పరేడ్‌కు అవకాశం ఇవ్వలేదంటే అర్థమేంటి?

మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ...

news

ఈ అవమానాల కంటే చెక్కేయడమే బెటర్: కర్నూలు టీడీపీలో ముసలం

కర్నూలు జిల్లా వర్గరాజకీయాలు తెలుగుదేశం పార్టీని నిలువునా ముంచనున్నాయా? పార్టీలో కొత్తగా ...

news

అటు నవ్వులే.. ఇటు నవ్వులే: గవర్నర్ హామీ ఎవరికి దక్కినట్లబ్బా!

రామాయణం తెలిసినవారికి లక్ష్మణ దేవర నవ్వు అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. రావణ వధ అనంతరం అయోధ్య ...

Widgets Magazine