గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (09:16 IST)

జల్లికట్టుపై సుప్రీం తీర్పు వెల్లడించాకే... కేంద్రం నిర్ణయం : మంత్రి అనిల్ దవే

జల్లికట్టు పోటీల నిర్వహణ అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఈ తీర్పు వెలువడిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్‌దవే తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడ

జల్లికట్టు పోటీల నిర్వహణ అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఈ తీర్పు వెలువడిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్‌దవే తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జల్లికట్టు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందువల్ల దానిపై కొత్త ఉత్తర్వులు జారీ చేసే అధికారానికి లేదని తేల్చిచెప్పారు. 
 
అలాగే, మరో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందిస్తూ జల్లికట్టు తమిళ సంప్రదాయ క్రీడ అని సుప్రీంకోర్టుకు తెలుసని, ఆ క్రీడకు విధించిన నిషేదాన్ని తప్పకుండా తొలగిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్ర బిజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ జల్లికట్టుపై నిషేధం తొలగించడానికి కేంద్రలోని బిజేపీ సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్‌ పార్టీ సహకరించడంలేదని మెలికపెట్టారు. మొత్తంమీద తమిళ సంప్రదాయ గ్రామీణ క్రీడావినోదం జల్లికట్టుపై రాజకీయం చదరంగం సాగుతోంది.