శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:03 IST)

పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఆ 4 గంటల్లో ఏం జరిగింది? భారత ఆర్మీ దెబ్బకు పాక్ షాక్...

యూరీ ఉగ్రదాడి జరిగిన 10 రోజుల తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో పొంచి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మొత్తం 7 శిబిరాలపై సుమారు 4 గంటలపాటు వైమానిక దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 38 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్

యూరీ ఉగ్రదాడి జరిగిన 10 రోజుల తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో పొంచి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మొత్తం 7 శిబిరాలపై సుమారు 4 గంటలపాటు వైమానిక దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 38 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సర్జికల్ దాడులపై పాకిస్తాన్ దేశానికి ముందుగానే సమాచారం ఇచ్చామని భారత డీజీఎమ్ఓ రణబీర్ సింగ్ వెల్లడించారు.
 
# బుధవారం అర్థరాత్రి 12.30 నిమిషాలకు భారత సైన్యం ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్లో ప్రత్యేక దళాలకు చెందిన పారా ట్రూపర్స్ పాల్గొన్నారు.
 
# కమెండోలు గగనతలం నుంచి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఎల్వోసిలో హెలికాప్టర్ల ద్వారా దిగారు. 
 
# సర్జికల్ స్ట్రైక్సుకు గాను భారత కమెండోలు 3 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లారు. 
 
# ఎల్వోసికి ఆవల ఉన్న భింబర్, హాట్‌స్ప్రింగ్, కెల్ అండ్ లిపా సెక్టార్లలోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేశారు.
 
# మొత్తం 7 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఇందులో ఉన్న 38 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఉగ్రవాదులకు తర్ఫీదునిస్తున్నవారితో సహా ఇద్దరు పాకిస్తాన్ సైనికులు కూడా హతమయ్యారు.
 
# ఈ దాడులకు హెలికాప్టర్లను ఉపయోగించారు. తెల్లవారు జాము 4.30 గంటలకు ఆపరేషన్ ముగిసింది. భారత సైన్యం కూల్ ఆపరేషన్ దెబ్బకు పాకిస్తాన్ షాక్ తిన్నది. అవి సర్జికల్ దాడులు కావంటూ సన్నాయినొక్కులు నొక్కుతోంది.