Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టైమ్ ఇచ్చేది లేదు.. వెంటనే లొంగిపో.. శశికళకు సుప్రీం షాక్.. అమ్మ తరిమేసిన వాడే?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (11:19 IST)

Widgets Magazine
sasikala

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చిన్నమ్మ జైలు కెళ్లడం ఖాయమైన నేపథ్యంలో.. ఆరోగ్యం బాగోలేదని లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలంటూ కోర్టులో అప్పీల్ చేసుకున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం నుంచి చుక్కెదురైంది. గడువు పెంచడం కుదరదని వెంటనే లొంగిపోవాలని సుప్రీం స్పష్టం చేసింది. కాగా, అనారోగ్య కారణాలను చూపిస్తూ లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని మంగళవారం నాడు శశికళ కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.
 
అప్పీల్‌పై కూడా సుప్రీం ప్రతికూలంగానే స్పందించడంతో శశికళ ముందున్న దారులన్ని ఇక మూసిపోయినట్టే. అదే సమయంలో బుధవారం నాడు శశికళ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. తాజా సుప్రీం తీర్పు నేపథ్యంలో శశికళ లొంగిపోతారా? లేక ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. 
 
ఇదిలా ఉంటే, రూ.66కోట్ల అక్రమాస్తుల కేసులో మంగళవారం నాడు తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో... తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే పగ్గాలను అప్పగించడంపై వీకే శశికళ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లను పార్టీలోకి తీసుకువచ్చారు. 
 
గతంలో వీరిద్దరినీ జయలలిత పార్టీ నుంచి సాగనంపగా... తిరిగి వారికే పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు శశికళ నిర్ణయించుకోవడం విశేషం. ప్రస్తుతం ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న శశికళ... డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. తాను జైలుకెళ్లడం ఖాయం కావడంతో పార్టీపై పట్టునిలబెట్టుకునేందుకే శశికళ తన సోదరి కొడుకైన దినకరన్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Surrender Immediately Tamilnadu Vk Sasikala More Time Supreme Court

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నమ్మ జైలుకు.. ఎమ్మెల్యేలు ఇంటికి.. ఐదుగురు గోడదూకి జంప్.. ఎక్కడికెళ్లారు?

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ...

news

జయలలిత, యడ్యూరప్ప బ్యారక్‌లోనే చిన్నమ్మ.. కోర్టులో లొంగిపోనున్న శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...

news

రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో 25మందికి అస్వస్థత.. ఇంటికి పంపించమని విజ్ఞప్తి.. శశికళ నో..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును సినీ నటుడు సుమన్ ...

news

పీఎస్ఎల్వీ-సీ37తో ఇస్రో కొత్త రికార్డు.. ఏకకాలంలో 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి.. సక్సెస్

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ...

Widgets Magazine