గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (16:59 IST)

తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో జయలలిత టాప్ : 31.58 శాతం మంది వెల్లడి

వచ్చే యేడాది మే నెలలో తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో... వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న అంశంపై ఓ సర్వే జరిగింది. తమిళనాడులో ఇటీవల పీపుల్‌ స్టడీస్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రిగా ఎవరు తగిన అభ్యర్థి అనే ప్రశ్నకు ప్రస్తుత సీఎం జయలలిత వైపే జనం మొగ్గు చూపారని ఆ సర్వే వెల్లడించింది. 
 
రాష్ట్రంలో 31.58 శాతం ఓటర్లు జయలలిత మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని... ఒకవేళ డీఎంకే గెలిస్తే సీఎం పదవి ఎవరు చేపట్టాలనే ప్రశ్నకు ఎక్కువ మంది కరుణానిధి తనయుడు ఎంకె స్టాలిన్‌ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్‌ తగిన అభ్యర్థి అని 27.98 శాతం ఓటర్లు భావిస్తుండగా ఐదు సార్లు సీఎంగా పనిచేసిన కరుణానిధి సీఎం కావాలని 21.33 శాతం ఓటర్లు కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. 
 
అయితే జయలలితకు ప్రధాన ప్రత్యర్థి ఎంకే స్టాలిన్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, ఇతర అభ్యర్థులు బాగా వెనకబడిపోయినట్లు ఆ సర్వే విశ్లేషించింది. ముఖ్యమంత్రి రేసులో డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్‌, పీఎంకే నాయకుడు అన్జుమణి రాందాస్‌లు బాగా వెనుకబడిపోయారు. అన్నాడీఎంకు ప్రజా బలం ఉన్నట్లు కనిపించినా కొన్ని సామాజిక వర్గాలు డీఎంకేకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే, తమిళనాడులో మద్య నిషేధం అమలు కావాలని అత్యధిక శాతం ప్రజలు కోరుతున్నారు.