శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (12:33 IST)

భారత్‌లో 90 లక్షల గృహాల్లో మహిళలే కుటుంబ పెద్దలు సెక్ రిపోర్ట్

భారత్‌లోని 90 లక్షల గృహాల్లో మహిళలే కుటుంబ పెద్దలుగా బాధ్యతలు పోషిస్తున్నారని సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ-సెక్) వివరాల్లో తేలింది. 80 సంవత్సరాల స్వతంత్ర భారతావని చరిత్రలో తొలిసారిగా విడుదలైన వివరాల్లో కొత్త విషయాలు బయటపెడుతున్నాయి. భారత్‌లో ఏ విధమైన ఆదాయ వనరులూ లేని 35 లక్షల కుటుంబాలు ఉన్నాయని సెక్ రిపోర్ట్ వెల్లడించింది. 
 
ఇకపోతే... లక్ష కుటుంబాల్లో కనీసం ఒక యాచకుడు ఉన్నాడని సిక్ వివరించింది. ఫ్రిజ్, ల్యాండ్ లైన్ ఫోన్, వాషింగ్ మెషీన్, టూ వీలర్‌లను కలిగివున్న కుటుంబాల సంఖ్య 86 లక్షలు కాగా, కోటికి పైగా కుటుంబాల్లో వీటిల్లో ఏదో ఒకటి ఉందని తెలిపింది. ఇదేవిధంగా విద్యుత్, మంచినీరు, టాయిలెట్ తదితర కనీస సౌకర్యాలు లేని గృహాల సంఖ్య 6.51 కోట్లని తేల్చింది.