శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (14:16 IST)

ఇరాక్‌లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్

ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులు హత్యకు గురైనట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. 
 
ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్ వార్తలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. అలాగే, బీఎస్‌స్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ ఇరాక్‌లో చిక్కుకున్న 39 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నట్లు చెప్పారు. బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచిస్తూనే.. కిడ్నాప్ వార్తలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం ఉందో సభకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. 
 
దీంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఒక ప్రకటన చేశారు. ఇరాక్‌లో చిక్కుకున్న గురైన 39 మంది భారతీయుల కోసం ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. భారతీయులు కిడ్నాపైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులు ఎక్కడ ఉన్నారో తెలియలేదని వివరించారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులు కోసం అధికారులు విచారణ జరుపుతున్నారని, వారు హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.