Widgets Magazine Widgets Magazine

అమెజాన్‌కు సుష్మా స్వరాజ్ వార్నింగ్.. సారీ చెప్తారా? వీసా రద్దు చేయమంటారా?

గురువారం, 12 జనవరి 2017 (06:38 IST)

Widgets Magazine

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్తారా? లేక వీసా రద్దు చేయమంటారా? అంటూ ఆమె హెచ్చరిక చేశారు. 
 
భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్‌లను ఈ సంస్థ విక్రయిస్తోంది. వీటిని తక్షణం వాటిని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులందరి వీసాలనూ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 
 
ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మా దేశ పతాకం ఉన్న అన్ని రకాల ప్రొడక్టుల విక్రయాలను నిలిపివేయాలి. ఈ పని చేయకుంటే, అమెజాన్ అధికారులెవ్వరికీ వీసాలు జారీ చేయం. గతంలో ఇచ్చిన వీసాలనూ రద్దు చేస్తాం" అన్నారు. 
 
కాగా, సుష్మా స్వరాజ్ ట్వీట్ చేసిన నాలుగు గంటల్లోనే అమెజాన్ కేటలాగ్ నుంచి అభ్యంతరకర ప్రొడక్టులను ఆ సంస్థ తొలగించింది. సెర్చ్ రిజల్ట్స్ నుంచి కూడా వాటిని తొలగించింది. ఈ ప్రొడక్టులను తాము డైరెక్టుగా విక్రయించడం లేదని, వాటిని థర్డ్ పార్టీ సెల్లర్స్ తమ వెబ్‌సైట్ మాధ్యమంగా విక్రయిస్తున్నారని వివరణ ఇచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోదీ పెద్దపులా.. అబ్బే.. చిట్టెలుక అంటున్న తృణమూల్

మద్దతుదారులు చెబుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపులి కాదని, గుజరాత్‌లో తన ...

news

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటున్న మన్మోహన్

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ముందుంది ముసళ్ల పండుగ సామెతను మక్కీకి మక్కీకిగా ...

news

జవాన్ తాగుబోతే కావచ్చు. ఆర్మీలో అవినీతి మాటేమిటి?

సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని సాక్ష్యాధారాలతో సహా ...

news

ఇచ్చేవాడికి సిగ్గు లేదు.. తీసుకునేవాడికీ అంతకంటే లేదు

కాటికి కాళ్లు చాచుకునే స్థితిలో ఉండి ప్రభుత్వ వృద్ధాప్య పించను పథకం ప్రకారం ఫించన్ రాక ...