శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (11:29 IST)

చేయి చేయి కలిపితే స్వచ్ఛ్ భారత్ సాధ్యమే : నరేంద్ర మోడీ!

దేశంలోని 125 కోట్ల మంది చేయి చేయి కలిపితే స్వచ్ఛ్ భారత్ సాధ్యమేనని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఢిల్లీలోని వాల్మీకి సదన్‌లో గురువారం స్పచ్ఛ్ భారత్‌ అభియాన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛ్ భారత్ కూడా సాధ్యమేనన్నారు. 
 
దేశ శాస్త్రవేత్తల కృషి వల్ల మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నాం. అందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛ్ భారత్ కూడా సాధ్యమే. స్వచ్ఛ్ భారత్‌లో అందరూ వారంలో 2 గంటలపాటు పాల్గొనాలి. క్విట్ ఇండియా, క్లీన్ ఇండియా అని మహాత్ముడు సందేశమిచ్చారు. గాంధీ నాయకత్వంలో మనం స్వాతంత్య్రం సాధించుకున్నాం. ఆయన కలలు కన్న స్వచ్ఛ్ భారత్ మాత్రం సాకారం కాలేద్నారు. 
 
ప్రభుత్వం వల్లే స్వచ్ఛ్ భారత్ సాధ్యం కాదు. అందరి మద్దతు అవసరం. పరిశుభ్రపరచడం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు. ఈ ఆలోచనా విధానం నుంచి మనం బయట పడాలి. సోషల్ మీడియాలో మైక్లీన్ ఇండియా ప్రచారం ప్రారంభించాం. పారిశుద్ధ్యంలో ప్రజలూ భాగస్వాములు కావాలి. భారత్ ఇది సాధిస్తుంది. భారత ప్రజలు ఇది సాధించగలరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.