శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (11:56 IST)

ఆయన ఖచ్చితంగా పురుషుడే...! పురుషత్వ పరీక్షల్లో వెల్లడి

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఖచ్చితంగా పురుషుడేనని పురుషత్వ పరీక్షల్లో తేలింది. తాను ఆరేళ్ల బాలుడులాంటి వాడినని అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. 
 
సీఐడీ డీఎస్పీ లోకేశ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ మేరకు వైదుల ధ్రువీకరణ పత్రాలతో కూడిన నివేదికను రామనగర్‌లోని సెషన్స్‌ కోర్టుకు సమర్పించింది. 
 
అయితే పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘ పురుషుడే’ అని నిర్ధారణ అయినట్లు తెలిపింది. పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 
 
అత్యాచార ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
 
దీనికి సంబంధించిన 31పేజీల నివేదిక కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్‌పీ లోకేష్ బుధవారం రామనగర్‌లోని సెషన్స్ కోర్టుకు అందించారు. 
 
తాదా ఇదే కేసుకు సంబంధించి ఆయనకు నిర్వహించిన ధ్వని సంబంధ పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. విచారణ సందర్భంగా నిత్యానందతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఆయన శిష్యులు కోర్టుకు హాజరయ్యారు.