Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా బిడ్డ హత్యను సినిమాగా నిర్మించవద్దు: స్వాతి తండ్రి గోపాలకృష్ణన్

శుక్రవారం, 2 జూన్ 2017 (12:20 IST)

Widgets Magazine

గతేడాది జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. అయితే పోలీస్‌ కస్టడీలో ఉండగా రామ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ హత్య దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. అలాగే స్వాతి పై పలు అనుమానాలు కూడా వచ్చాయి.
 
ఇప్పుడు ఆ సంఘటనపై తమిళంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తన కూతురి హత్యను సినిమాగా నిర్మించవద్దని స్వాతి తండ్రి సంతన గోపాల కృష్ణన్‌ పోలీసులను ఆశ్రయించారు. సినిమా కోసం తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అంతేగాక, ఈ ఘటనను తెరకెక్కిస్తే వాస్తవానికి వ్యతిరేకంగా తీసే అవకాశాలున్నాయని గోపాల కృష్ణన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఈ హత్యను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రమేశ్‌ సెల్వన్‌ ‘స్వాతి కొలై వళక్కు’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌, పోస్టర్లను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో స్వాతి పాత్రలో ఆయిరా నటిస్తోంది. నిందితుడు రాంకుమార్‌ పాత్రలో మనో అనే కొత్త నటుడిని పరిచయం చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రహస్యంగా ప్రేయసిని కలిసేందుకు వచ్చిన రిమాండ్ ఖైదీ.. పోలీసులు పట్టేశారు..

రిమాండ్ ఖైదీని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. పోలీసులకు చుక్కలు చూపించి ...

news

రాష్ట్రానికి అన్యాయం జరిగిన రోజును మరిచిపోకూడదు.. అదో చీకటి రోజు: చంద్రబాబు

రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరిచిపోకూడదని కాబట్టే.. తానిలా ...

news

దేవాన్ష్ హెరిటేజ్ పాలే తాగుతున్నాడు.. మా పాలలో కల్తీ లేదు: నారా బ్రాహ్మణి

సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే ...

news

ఆస్పత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త కోసం భోజనం తీసుకువచ్చేందుకు వెళితే..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై ...

Widgets Magazine