శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:52 IST)

తాజ్‌మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలా? మంత్రికి మెంటలా?

తాజ్మహల్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని సృష్టించాయి. తాజ్మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైనాయి. 
 
ప్రతిరోజూ ఐదుసార్లు తాజ్మహల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని యు.పి.లోని అధికార సమాజ్వాది పార్టీని మరో ముస్లిం నాయకుడు కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే బీజేపీ ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండించిన నేపథ్యంలో ఆజంఖాన్‌కి పిచ్చెక్కిందేమోనన్న సందేహాన్ని బ్రజ్ మండల్ హెరిటేజ్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర శర్మ వ్యక్తం చేశారు. ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం మంత్రికి తగదని సూచించారు.