మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (00:31 IST)

తమిళనాడు సీఎం జయలలిత ఇకలేరు... అపోలో ఆస్పత్రి అధికారిక ప్రకటన

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి.. పురచ్చితలైవి డాక్టర్ జయలలిత ఇక లేరు. ఆమెకు వయస్సు 68 యేళ్లు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను.. పార్టీ కార్యకర్తలను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లో

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి.. పురచ్చితలైవి డాక్టర్ జయలలిత ఇక లేరు. ఆమెకు వయస్సు 68 యేళ్లు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను.. పార్టీ కార్యకర్తలను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లోకాలకు తరలిపోయారు. ఈ విషయంపై ఆమె చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం సోమవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత అధికారికంగా ప్రకటించింది. 
 
జయలలిత జయలలిత కన్నుమూశారంటూ వచ్చిన వార్తలపై పలువురు తెలుగు, తమిళ సినీ నటులు వేగంగా స్పందించారు. సీఎం కన్నుమూసినట్టు వార్తలు తమిళ చానళ్లు సహా జాతీయ మీడియా సైతం వార్తలు ప్రచురించడంతో సోషల్ మీడియాలో పలువురు నటులు తమ బాధను వ్యక్తం చేశారు. వదంతులను నమ్మి నిజమని భావించి ట్వీట్లు చేశారు. ఈ పుకార్లపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. అవన్నీ నిరాధారమైన పుకార్లు అంటూ ప్రకటించింది. 
 
‘అమ్మ బాగానే ఉన్నారు.. ‘ఇక పురచ్చితలైవి ఇంటికి వచ్చేస్తారు..’ అని పేర్కొంది. ఈ ఆనందం కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరైపోవడంతో అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు. సరిగ్గా రెండున్నర నెలల క్రితం జయలలిత డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో బాధపడుతూ సెప్టెంబరు 22న స్థానిక గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.