బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (00:49 IST)

జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.. అపోలో తీరుపై ఫ్యాన్స్ ఫైర్.. దాడి.. ఫర్నిచర్స్ ధ్వంసం..

తమిళనాడు సీఎం జయలలిత తుదిశ్వాస విడిచారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం అర్థరాత్రి 11.30 గంటలకు అమ్మ కన్నుమూసినట్లు అపోలో ప్రకటించింది. అంతకుముం

తమిళనాడు సీఎం జయలలిత తుదిశ్వాస విడిచారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం అర్థరాత్రి 11.30 గంటలకు అమ్మ కన్నుమూసినట్లు అపోలో ప్రకటించింది. అంతకుముందు అమ్మ కన్నుమూశారని వార్తలు వచ్చినా అవన్నీ అవాస్తవాలేనని నమ్మబలికిన అపోలో.. ప్రెస్ రిలీజ్ ద్వారా అమ్మ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ప్రకటించింది.

అమ్మ మృతి మట్ల తమిళనాట విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్యకర్తలు అమ్మలేని ప్రపంచాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు బాదుకుని లబోదిబోమంటున్నారు. మొత్తానికి ఎనిమిది కోట్ల తమిళులు అమ్మలేని అనాథలయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో 74 రోజులుగా చికిత్స పొందుతున్న సీఎం జయలలిత సోమవారం రాత్రి 11:30గంటలకు కన్నుమూసినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.
 
అమ్మ మృతితో తమిళనాడులో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అమ్మ మరణం వార్త విన్న అభిమానులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై సస్పెన్షన్‌తో తమిళ ప్రజల జీవితాలతో అపోలో ఆస్పత్రి సిబ్బంది ఆడుకున్నారంటూ ఆగ్రహించిన అభిమానులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రి దగ్గర జామార్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.